
జయహో జవాన్.. కాసుకో పాకిస్తాన్
శివాజీనగర: భారతీయ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కార్యాచరణకు మద్దతు పలుకుతూ కేపీసీసీ శుక్రవారం బెంగళూరులో తిరంగ యాత్ర చేపట్టింది. కేఆర్ సర్కిల్ నుంచి చిన్నస్వామి క్రీడామైదానం వద్ద మిన్స్ స్కౌయర్ వరకు తిరంగ యాత్ర సాగింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ తిరంగ యాత్రలో మంత్రులు డాక్టర్ జీ.పరమేశ్వర్, హెచ్.కే.పాటిల్, రామలింగారెడ్డి, కే.హెచ్.మునియప్ప, బోసురాజు, కే.సుధాకర్, దినేశ్‌గుండురావుతో పాటుగా కాంగ్రెస్ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొని త్రివర్ణ జెండా చేత పట్టుకొని అడుగులు వేశారు. పహల్గాం నరమేధానికి ప్రతీకారంగా భారతీయ సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్‌కు మద్దతు ఇవ్వటం ఈ దేశంలో ప్రతి ఒక భారతీయుడి కర్తవ్యమని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. ఈ దిశలో కాంగ్రెస్ పార్టీ తిరంగ యాత్రను జరిపి సైన్యం కార్యచరణకు మద్దతు నిచ్చిందని తెలిపారు.

జయహో జవాన్.. కాసుకో పాకిస్తాన్

జయహో జవాన్.. కాసుకో పాకిస్తాన్