బళ్లారిలో ప్రశాంతంగా నీట్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

బళ్లారిలో ప్రశాంతంగా నీట్‌ పరీక్ష

May 5 2025 9:02 AM | Updated on May 5 2025 9:02 AM

బళ్లా

బళ్లారిలో ప్రశాంతంగా నీట్‌ పరీక్ష

సాక్షి,బళ్లారి: వైద్య కోర్సులో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ యూజీ–2025 పరీక్షలు బళ్లారిలో ప్రశాంతంగా జరిగాయి. డాక్టర్‌ కావాలనే సంకల్పంతో పీయూసీలో ఎంతో కష్టపడి చదివిన వేలాది మంది విద్యార్థులతో పాటు, గతంలో నీట్‌లో విఫలమైన విద్యార్థులు భారీగా తరలిరావంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి ఏర్పడింది. గతంలో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు నీట్‌ పరీక్షలు రాసేందుకు బెంగళూరు లేదా హుబ్లీకి వెళ్లేవారు. మూడు సంవత్సరాల నుంచి బళ్లారి కేంద్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలులోపు పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులను పూర్తిగా తనిఖీలు నిర్వహించి లోపలకు అనుమతించారు. గడియారాలు, గ్యాడ్జెట్లను నిషేధించారు. నగరంలోని గర్ల్స్‌ కళాశాల, సతీష్‌ చంద్ర అగర్వాల్‌ కళాశాల, మున్సిపల్‌ హైస్కూల్‌లో పరీక్షలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చారు. తమ పిల్లలు లోపలకు వెళ్లిన తర్వాత వారు తిరిగి వచ్చేవరకు అక్కడే పడిగాపులు గాశారు. వేశారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

హొసపేటె: కొప్పళ జిల్లాలో నిర్వహించిన నీట్‌ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నాలుగు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 2.163 మంది విద్యార్థులకు 2,142 మంది హాజరయ్యారు. 21 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. పట్టణంలోని బాలికల ప్రభుత్వ పీయూ కాలేజీ, ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను నీట్‌ ప్రవేశ పరీక్షలకు అనుమతి ఇవ్వలేదు. నిబంధనలు కఠినతరంగా ఉండటంతో ముక్కు పుడుకులతో పాటు కాళ్ల పట్టిలు, మెడలో బంగారు చైన్లు తీసివేసి విద్యార్థినులు వాటిని తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. హెయిర్‌బ్యాండ్లను, గాజులను సైతం తొలగించాల్సి వచ్చిందని విద్యార్థినులు వాపోయారు. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షలకు పెన్నులను కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. ప్రతి విద్యార్థి నుంచి రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు తీసుకొని, ఒరిజినల్‌ గుర్తింపుకార్డులను క్షుణంగా పరిశీలించారు.

తల్లిదండ్రులతో కలిసి వచ్చిన విద్యార్థులు

కేంద్రాల వద్ద సందడి

క్షుణ్ణంగా తనిఖీ చేసి అభ్యర్థులను

అనుమతించిన సిబ్బంది

కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు

బళ్లారిలో ప్రశాంతంగా నీట్‌ పరీక్ష 1
1/3

బళ్లారిలో ప్రశాంతంగా నీట్‌ పరీక్ష

బళ్లారిలో ప్రశాంతంగా నీట్‌ పరీక్ష 2
2/3

బళ్లారిలో ప్రశాంతంగా నీట్‌ పరీక్ష

బళ్లారిలో ప్రశాంతంగా నీట్‌ పరీక్ష 3
3/3

బళ్లారిలో ప్రశాంతంగా నీట్‌ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement