
●రాయచూరులో కుండపోత
రాయచూరు రూరల్: రాయచూరులో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసినా రహదారులు బురద గుంటలుగా మారాయి. సుమారు గంట పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వారం రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. దాదాపు 40–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ప్రజలు తల్లడిల్లి పోయారు. గంట పాటు వాన పడినందున ఎండ వేడిమితో ఉక్కపోత మాత్రం తగ్గలేదు. కూరగాయల మార్కెట్, బంగీకుంట, మచ్చ బజార్, బైరూన్కిల్లా ప్రాంతాల్లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. ఏపీఎంసీలో నిల్వ ఉంచిన ధాన్యం రాశులు తడిసిపోయాయి.

●రాయచూరులో కుండపోత