
రెండు బైక్‌ల ఢీ.. ఇద్దరు మృతి
● మరో ఇద్దరికి గాయాలు
హుబ్లీ: రెండు బైక్‌ల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జిల్లాలోని కలఘటిగి తాలూకా ఉండగోడ రోడ్డు మాచాపుర గ్రామం వద్ద చోటు చేసుకుంది. మృతులను కలఘటిగి తాలూకా తావరగెరె గ్రామానికి చెందిన మంజునాథ్ కల్లప్ప వాలికార(19), ధార్వాడ తాలూకా జోగెల్లాపుర గ్రామానికి చెందిన బసవరాజ్ శివప్ప సోమన్నవర(36)గా గుర్తించారు. బెళవంతర గ్రామానికి చెందిన ఆనంద నూల్వి, తావరగెరె గ్రామానికి చెందిన ప్రవీణ భజంత్రి గాయపడ్డారు. వీరిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. అతివేగంగా వస్తున్న రెండు బైక్‌లు పరస్పరం ఢీకొన్న తీవ్రతకు బసవరాజ్, మంజునాథ తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే పోలీసులు, మాచాపుర గ్రామస్తులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి హుబ్లీ కేఎంసీ ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందారు. కలఘటిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పదవిని కాపాడుకోడానికే కులగణన అస్త్రం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కులగణన పేరుతో తన పదవిని కాపాడుకోడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుట్ర పన్నారని నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ ఆరోపించారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తోడు తన పదవిని రక్షించుకోవడానికి నాటకమాడుతున్నట్లు తెలిపారు. కులగణనలో సరైన గణాంకాలు లేవన్నారు. తప్పుల తడకగా నివేదిక అందించారన్నారు. ఏనాడూ ఏ అధికారి కులగణన సమీక్షలకు హాజరు కాలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గంగాధర్ నాయక్, త్రివిక్రం జోషిలున్నారు.
అగ్నిప్రమాదాలపై తస్మాత్ జాగ్రత్త
రాయచూరు రూరల్: అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అగ్నిమాపక దళం అధికారి మారుతి సూచించారు. గురువారం రాయచూరు తాలూకా మర్చేడ్ గ్రామంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారోత్సవంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలంలో గడ్డి వాములకు నిప్పుంటుకోవడం, విద్యుత్ స్తంభాల్లో నుంచి మంటలు రావడం, ఇతరత్ర వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారి మహ్మద్, ముజాహిద్, ఆంజనేయలున్నారు.
23న జనాక్రోశయాత్ర రాక
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ధరల పెంపుతో వచ్చే ఆదాయాన్ని గ్యారెంటీల కోసం ప్రజలకు ఉచితంగా ఇచ్చి వారి నుంచి వడ్డీని వసూలు చేస్తోందని విధాన పరిషత్ సభ్యుడు నవీన్ కుమార్ ఆరోపించారు. గురువారం జిల్లా బీజేపీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లును యూనిట్‌కు 36 పైసలు, పాల ధరను లీటరుకు రూ.9, బస్ చార్జీల ధరలు, స్టాంప్‌డ్యూటీలు పెంచడం తగదన్నారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన జనాక్రోశయాత్ర రాయచూరుకు ఈనెల 23న రానుందన్నారు. పాడి రైతులకు రూ.662 కోట్ల మేర బకాయి ఉందన్నారు. గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించారని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరనగౌడ, మాజీ ఎంపీ బీవీ.నాయక్, మాజీ శాసన సభ్యులు బసనగౌడ, గంగాధర నాయక్, ప్రతాప్‌గౌడ పాటిల్, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, నేతలు రవీంద్ర జాలదార్, శశిరాజ్, నాగరాజ్, శంకరరెడ్డి, ఆంజనేయ, రామచంద్ర, శివకుమార్, విజయ్ కుమార్, గోపాల్‌రెడ్డి, నరసింహులున్నారు.
వినూత్నం.. చలివేంద్రం
రాయచూరు రూరల్: నగరసభ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో అమృత నెరళు పేరుతో వినూత్నంగా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వెదురుతో కూడిన గుడిసెల మాదిరిగా వీటిని నిర్మించారు. వేసవిలో వివిధ చోట్ల నుంచి నగరానికి వచ్చిన ప్రజల దాహార్తిని తీర్చడానికి చల్లని నీటి కుండలను ఏర్పాటు చేసి విశ్రాంతి పొందడానికి వీలు కల్పించారు. నగరంలోని ఆర్టీఓ సర్కిల్, కేఈబీ పాఠశాల, జహీరాబాద్ సర్కిల్, తీన్‌కందిల్, బస్టాండ్, గంజ్ సర్కిల్‌లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు వీటిని సద్వినియోగ పరుచుకోవాలని నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో కోరారు.

రెండు బైక్‌ల ఢీ.. ఇద్దరు మృతి

రెండు బైక్‌ల ఢీ.. ఇద్దరు మృతి

రెండు బైక్‌ల ఢీ.. ఇద్దరు మృతి