
అధోగతిలో వాహన చాలన శిక్షణ కేంద్రం
రాయచూరు రూరల్: ప్రభుత్వ ఆధీనంలో సర్కారీ వాహన డ్రైవింగ్ ట్రైనింగ్ కేంద్రం ద్వారా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని భావించిన సర్కార్ ఆశయానికి నీళ్లు చల్లినట్లైంది. 2017లో నగరానికి మూడు కి.మీ.దూరంలోని రెవెన్యూ భూమి ఆధీనంలోని సర్వే నంబర్ 11–22లో ఐదు ఎకరాల భూమిలో రూ.8 కోట్లతో హైటెక్ పథం నిర్మాణం చేశారు. విద్యుత్ సౌకర్యం, జనరేటర్ ఏర్పాటు చేశారు. 2017లో వాహనాల ట్రైనింగ్ కేంద్రం కోసం తెచ్చిన ఉపకరణాలు, యంత్రాలు సమయం ముగిసి పోతున్నా నేటికీ ఒక్కరికి కూడా ఆర్టీఓ అధికారులు ఉపయోగించకుండా ఈ కేంద్రం వైపు కన్నెత్తి చూడక పోవడం విడ్డూరంగా ఉంది. వాహన చాలన శిక్షణ కేంద్రం చుట్టు ఏపుగ చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి పోయాయి. ఆరేళ్ల నుంచి హైటెక్ పథ కేంద్రం ఎవరో చేసిన తప్పుకు నేటికీ పనులు కూడా ప్రారంభం కావడం లేదు. సర్వేయర్, ఆర్టీఏ, కాంట్రాక్టర్లు చేసిన తప్పిదం వల్ల ఆర్టీఓ అధికారులు వాహన చాలన శిక్షణ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. కేఎస్‌ఆర్టీసీ అధికారులు ఆర్టీఓ అధికారులకు అప్పగించలేదు. ప్రధాన రహదారుల నిర్మాణానికి 23 సెంట్ల భూమి కావాల్సి ఉంది. ఇందుకు ఎవరో చేసిన తప్పుకు రూ.8 కోట్లతో నిర్మించిన హైటెక్ పథ సంచలనం, వాహనాల శిక్షణ కేంద్రం మరుగున పడే అవకాశశముంది. ఈ విషయంలో రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సర్కారు ఆశయానికి తూట్లు
నిరుపయోగంగా నిర్మాణాలు

అధోగతిలో వాహన చాలన శిక్షణ కేంద్రం