
ఈదురుగాలి, వాన బీభత్సం
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుంద పట్టణంతో పాటు తాలూకాలోని కొన్ని గ్రామాల్లో బుధవారం సాయంత్రం పిడుగులు, ఉరుములతో ఈదురు గాలి వీచి భారీగా వర్షం కురిసింది. పట్టణంలోని సుడిగాలి తీవ్రతకు అక్కడక్కడ చెట్లు కూలి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా గాంధీ మార్కెట్‌లోని కూరగాయల వ్యాపారులు తాత్కాలికంగా నిర్మించుకున్న షెడ్లు, శామియానాలు ఈదురుగాలికి ఎగిరిపోయాయి. తాలూకాలోని కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలి పోయాయి. అయితే ఎటువంటి ప్రాణహాని జరగలేదని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
నేలకొరిగిన బొప్పాయి, మామిడి
హొసపేటె: విజయనగర జిల్లాలోని కూడ్లిగి తాలూకా గుడేకోట ఫిర్కాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం, వీచిన ఈదురు గాలులకు 9 ఎకరాల బొప్పాయి తోట, మామిడి పంట నాశనమైంది. గాలి, ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో బొప్పాయి తోట దెబ్బతింది. నేలబొమ్మనహళ్లి, చంద్రశేఖరపురతో పాటు వివిధ గ్రామాల్లో గాలి, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. నేలబొమ్మనహళ్లికి చెందిన రైతు సిద్దేష్ 9 ఎకరాల పొలంలో పండించిన బొప్పాయి పంట మొత్తం గాలివాన కారణంగా నాశనమై లక్షలాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. కొన్ని గ్రామాల్లోని పండ్ల తోటలు కూడా వర్షం, ఈదురుగాలికి దెబ్బతిన్నాయి.
వరుణ దేవుని ప్రకోపం
ఉద్యాన పంటలకు నష్టం

ఈదురుగాలి, వాన బీభత్సం