
రహదారి నిర్మాణంలో లోపాలు
రాయచూరు రూరల్: జాతీయ రహదారి–167 నిర్మాణంలో లోపాలు జరిగాయని సామాజిక కార్యకర్త తలెకాయ మారెప్ప ఆరోపించారు. బుధవారం ఆయన రోడ్డు పనులను పరిశీలించి మాట్లాడారు. గిల్లేసూగూరు క్యాంప్ నుంచి శక్తినగర్ వరకు రహదారి నిర్మాణం కోసం రూ.51 కోట్లు నిధులు కేటాయించినా పనులు మాత్రం నాసిరకంగా చేపడుతున్నారన్నారు. అంబేడ్కర్ సర్కిల్‌లో జిబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయలేదన్నారు. రహదారిపై స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సూచన ఫలకాలు ఏర్పాటు చేయక పోవడాన్ని తప్పు బట్టారు. నాసిరకంగా పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్నారు.
పెండింగ్ పనుల పూర్తికి వినతి
రాయచూరు రూరల్: అరకొరగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ను ఉన్నఫళంగా ప్రారంభించడం తగదని, మూడు నెలల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని కరవే డిమాండ్ చేసింది. బుధవారం ఆర్టీసీ బస్టాండ్‌లో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాజు మాట్లాడారు. అరకొరగా పనులు చేపట్టారని, మరుగుదొడ్లు, షెల్టర్, రక్షణ గోడ, బస్ డిపోల వంటి నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు. పనులు పూర్తి చేయాలని కోరుతూ తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.
మహ్మద్ ప్రవక్తపై నిందన.. యత్నాళ్‌పై కేసు
హుబ్లీ: బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్‌పై మహ్మద్ ప్రవక్తను చులకనగా నిందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈనెల 7న హుబ్లీలోని బాని వీధిలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న యత్నాళ్ మాట్లాడుతూ ఇస్లాం మతం, మహ్మద్ ప్రవక్త గురించి ఉద్రేకంతో చులకనగా మాట్లాడిన వ్యాఖ్యలపై విజయపురలోని గోల్‌గుంబజ్ పోలీసు స్టేషన్‌లో మహ్మద్ ఉన్నన్ ఫిర్యాదు చేశారు.
హైఓల్టేజీతో గ్రామంలో
అంధకారం
●విద్యుత్ పరికరాలు బుగ్గి
రాయచూరు రూరల్: ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచి, వానలు కురవడంతో హైఓల్టేజీ సమస్యతో గ్రామం చీకటిగా మారడమే కాకుండా వందలాది ఇళ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయిన ఘటన యాదగిరి జిల్లా జాలహళ్లిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన గాలి వానకు 330 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో గ్రామంలోని ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. ఒక్కసారిగా ఇళ్లలో ఏర్పడిన మంటలను చూసిన సురపుర తాలూకా జాలహళ్లి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
మహిళల వేషాల్లో
పురుషులకు ఉపాధి
రాయచూరు రూరల్: మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ కూలీలకు పనులు కేటాయించాల్సి ఉంది. అధికారులు తమ స్వార్థం కోసం మగ కూలీలను మహిళల వేషాల్లో వచ్చి నరేగ పనులు చేపట్టిన వైనం యాదగిరి జిల్లాలో సంచలనం రేపింది. యాదగిరి తాలూకా మల్హారలో కూలీ కార్మికుల పేరుతో గోల్‌మాల్ చేయడం అధికారులకు అందె వేసిన చెయ్యిగా మారింది. పూజారి పొలంలోని కాలువల్లో పూడికతీత పనులకు వ్యవసాయ కూలీ కార్మికులు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డూప్లికేట్ ఫొటోల కోసం ఎన్‌ఎంఎంఎస్‌లకు కార్మికుల హాజరు జాబితాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈ తతంగానికి అధికారి వీరేష్ పురుషులను మహిళల వేషాల్లో నరేగ పనులు చేయించారు. మహిళా కార్మికుల పేరుతో పురుష కార్మికులకు చీరలు కట్టించి ఫొటోలు దిగడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

రహదారి నిర్మాణంలో లోపాలు

రహదారి నిర్మాణంలో లోపాలు

రహదారి నిర్మాణంలో లోపాలు