రాయచూరు రూరల్: నగరంలో ఖురాన్ పఠనం అభియాన్‌కు మాజీ శాసన సభ్యుడు సయ్యద్ యాసిన్ శ్రీకారం చుట్టారు. సోమవారం రాత్రి మహిళా సమాజ్ ఆవరణలో 13వ ఏడాది ఖురాన్ పఠనం అభియాన్ ద్వారా ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరితో సఖ్యతతో మెలగాలని సూచించారు. రాయచూరులో హిందూ, ముస్లిం అనే భేదభావాలను మరిచి సోదరులుగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావించారు. రంజాన్ మాసం సందర్భంగా నగరంలో ఇఫ్తార్ కూటమిని ఏర్పాటు చేశారు. ఏడు గంటలకు కాంట్రాక్టర్ సత్యనారాయణ ఏక్ మినార్ మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ను అందించారు. ఈ సందర్భంగా మసీదు నిర్వాహకులు లతీఫ్, రజాక్, రవి, మున్నా, రసూల్, ఫారూక్, సోహైల్, సలీంలున్నారు.
ఖురాన్ పఠనం అభియాన్‌కు శ్రీకారం
మసీదులో ముస్లింలకు ఇఫ్తార్ విందు
ప్రతి ఒక్కరితో సఖ్యతగా మెలగాలి