నేతల చిత్తశుద్ధి లోపం.. అభివృద్ధి శూన్యం | - | Sakshi
Sakshi News home page

నేతల చిత్తశుద్ధి లోపం.. అభివృద్ధి శూన్యం

Mar 25 2025 1:41 AM | Updated on Mar 25 2025 1:36 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధి కొరతతో కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో అభివృద్ధి శూన్యమైందని హైదరాబాద్‌ కర్ణాటక పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజాక్‌ ఉస్తాద్‌ విచారం వ్యక్తం చేశారు. సోమవారం తారానాథ్‌ విద్యా సంస్థ ఆధ్వర్యంలో సోమ సుభద్రమ్మ రామనగౌడ మహిళా కళాశాలలో ఎల్‌వీడీ కళాశాల పాత విద్యార్థులతో ప్రాంతీయ అసమానతలు– సమస్యలు –సవాళ్లు అనే అంశంపై ఉపన్యసించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతం గత 77 ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సౌకర్యాలు, సార్వజనిక సేవలు, మానవ అభివృద్ధి గణాంకాలతో పోల్చితే ఇక్కడి ప్రజలు ఎన్నుకునే ప్రతినిధులు సమస్యలను వదిలి స్వార్థం వైపు ముందడుగు వేస్తున్నారన్నారు. డాక్టర్‌ వైజనాథ్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఆర్టికల్‌–371(జె) 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో అమలైందన్నారు. నంజుండప్ప నివేదిక ప్రకారం 114 తాలూకాల్లో 29 తాలూకాలు వెనుకబడినట్లు నివేదిక ఇచ్చినా ఫలితం శూన్యమన్నారు. చెన్నమల్లికార్జున, ప్రిన్సిపాల్‌ సంజయ్‌ పవార్‌, త్రివేణి, ఆంజనేయ, ఓబులేష్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement