మండ్య: వేసవిలో పంటల రక్షణ కోసం ప్రతి నియోజక వర్గం పరిధిలో నీటికుంటల పథకాన్ని అమలు చేస్తాము, రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎన్.చలువరాయ స్వామి అన్నారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ పథకాలను ప్రారంభించారు. వేసవిలో నీటి కొరత ఉంటుంది, దీని వల్ల పంటలు దెబ్బతినకుండా ప్రతి పొలంలో నీటికుంటను తవ్వుకోవడానికి ప్రభుత్వం రైతులకు సహాయం చేస్తుందని తెలిపారు. 104 తాలూకాలలో పంటలకు నీటి కొరత ఉందని తెలిపారు. అక్కడ ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు.
అమ్మా.. పాము కాటేసింది
● బాలుడు చెప్పినా నమ్మని తల్లి
● ఆస్పత్రిలో చిన్నారి మృతి
మండ్య: బహిర్భూమికి వెళ్లిన బాలున్ని పాము కాటు వేయడంతో చనిపోయిన సంఘటన జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని బాబురాయనకొప్పలు గ్రామంలో జరిగింది. పవిష్ (4) మృతబాలుడు. ఆరేళ్ల కిందట గాయత్రిని తమిళనాడుకు చెందిన రమేష్ కుమార్ ఇచ్చి వివాహం జరిపించారు. గాయత్రి రెండవ కాన్పు కోసం కొడుకుతో కలిసి పుట్టింటికి వచ్చింది. సోమవారం పవిష్ బహిర్భూమి కోసం ఇంటి పక్కన స్థలంలోకి వెళ్లాడు. ఆ సమయంలో ఏదో పాము చిన్నారిని కరిచింది. వెంటనే బాలుడు వచ్చి నన్ను పాము కొరికింది అని తల్లికి చెప్పాడు. కానీ వారు ఊరికే అలా చెబుతున్నాడని పట్టించుకోలేదు. అర్ధగంట తరువాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తున్న సమయంలో చనిపోయాడు.
కనువిందుగా రథోత్సవం
చింతామణి: తాలూకాలోని కంగానపల్లి గ్రామంలో వెలసిన పురాతన శ్రీ సీతా రామాంజనేయస్వామి ఆలయ బ్రహ్మ రథోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలకరించిన మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు పండితులు పూజలు నిర్వహించారు. తేరులో ప్రతిష్టించి లాగారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పాల్గొన్నారు. కళా బృందాల ప్రదర్శనలు అలరించాయి.
ధైర్యంగా ఎమ్మెల్యేలపై
చర్య తీసుకున్నా
● విధాన సభాపతి ఖాదర్
యశవంతపుర: స్పీకర్ స్థానానికి అగౌరవం తెచ్చేలా ప్రవర్తించినందునే 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు విధానసభ స్పీకర్ యూటీ ఖాదర్ చెప్పారు. సోమవారం దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాలంటే ఇలాంటి చర్యలు తప్పవన్నారు. సభలో స్పీకర్ శక్తిమంతుడు, గతంలోనే స్పీకర్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటివి మళ్లీ జరిగేవి కాదన్నారు. అప్పటి స్పీకర్లు దైర్యం చేయలేదు. నేను ధైర్యం చేసి 18 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశానని చెప్పారు. దీనిని శిక్షగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఉత్తమమైన ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుకునేందుకు అవకాశం కల్పించానన్నారు. ద్రవ్య వినిమయ బిల్ పాస్ కాకుండా గొడవ చేశారు, ఆ బిల్లు ఆమోదం పొందకుంటే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావన్నారు. ఇందుకు తాను అవకాశం ఇవ్వలేదని తెలిపారు.
పెళ్లాడి.. పోలీస్‌స్టేషన్‌కు
చిక్కబళ్లాపురం: మతాంతర ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట భద్రత కావాలని పోలీసులను కోరింది. ఈ ఘటన చిక్క నగరంలో జరిగింది. తాలూకాలోని మైలప్పనహళ్లివాసి హసీనా (23), ఎదురింటిలో ఉండే నాగార్జున (24) రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకొంటున్నారు. పెళ్లి చేసుకుంటామని ఇళ్లలో చెప్పగా వారు తిరస్కరించారు. దీంతో చిక్కకు వచ్చి ఓ గుడిలో తాళి కట్టి పెళ్లి చేసుకుని పోలీసు స్టేషన్‌కు వచ్చారు. యువతి తల్లిదండ్రులు వచ్చి ఎంత వేడుకొన్నా, హసీనా భర్తతోనే ఉంటాను అని తెగేసి చెప్పింది. ఈ ప్రేమ వివాహం అందరినీ సంభ్రమానికి గురిచేసింది.
పొలాల్లో నీటికుంటల తవ్వకాలు
పొలాల్లో నీటికుంటల తవ్వకాలు
పొలాల్లో నీటికుంటల తవ్వకాలు