ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం | - | Sakshi
Sakshi News home page

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం

Mar 24 2025 5:59 AM | Updated on Mar 24 2025 5:58 AM

కొమ్మ పడి చిన్నారి మృతి

కమ్మనహళ్లికి చెందిన శక్తి అనే వ్యక్తి మూడేళ్ల కుమార్తె రక్ష తో పులకేశినగరలో బైకులో వెళుతుండగా ఒక్కసారిగా చెట్టు కూలిపోయింది. కొమ్మనేరుగా చిన్నారిపై పడింది. బలమైన గాయం కావడంతో తల నుంచి తీవ్రరక్తస్రావమై అక్కడే చనిపోయింది. బేకరి నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బీబీఎంపీ అటవీ విభాగం చీఫ్‌ స్వామి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

బనశంకరి: వేసవి వర్షం ఊపేసింది. రాజధాని బెంగళూరు శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులు, పిడుగులు, వడగండ్ల వానతో తల్లడిల్లింది. పలుచోట్ల చెట్లు కొమ్మలు పడిపోయాయి. యలహంక ప్రాంతంలో ఇళ్లలోకి వాననీరు చొరబడగా కోగిలు క్రాస్‌తో పాటు ఇతర రోడ్లలో నీరు చేరి ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ ఏడాది మొదటివర్షమే భారీగా కురిసింది. బెంగళూరు ఉత్తర భాగంలో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాదిలో నైరుతి రుతుపవనాల అవధిలో సైతం బెంగళూరు ఉత్తర భాగం, యలహంక, కోగిలు క్రాస్‌ తదితర ప్రదేశాలు ముంపునకు గురయ్యాయి. శనివారం ఉదయం నుంచి నగరంలో మేఘావృతమై సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. క్రమంగా నగరవ్యాప్తంగా విస్తరించి అర్ధరాత్రి వరకు కొనసాగింది.

ఇళ్లలోకి నీరు

యలహంక ఓల్డ్‌టౌన్‌ ప్రాంతంలో 15 కు పైగా ఇళ్లలోకి వర్షంనీరు చొరబడింది. ఒక్కసారి నీరు చొరబడటంతో ఇళ్లలో నిత్యావసర వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. రాజకాలువలో మట్టి నిండిపోవడంతో వర్షపు నీరు సజావుగా ప్రవహించడానికి అవకాశం లేకపోవడంతో ఇళ్లోకి నీరు చొరబడిందని స్దానికులు ఆరోపించారు.

జక్కూరులో అత్యధిక వర్షం

జక్కూరు, చౌడేశ్వరి నగరలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హగదూరు, వీ.నాగేనహళ్లిలో 3.4 సెంటీమీటర్లు, విద్యారణ్యపురలో 3.2, హొరమావు, బిళేకహళ్లిలో తలా 2.1 బసవనపుర 1.9, గరుడాచార్‌పాళ్య 1.8, బీటీఎంలేఔట్‌ 1.7, రామమూర్తినగర , కొడిగేహళ్లిలో తలా 1.6, కాడుగోడిలో 1.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది.

విమానాశ్రయంలో ఆటంకం

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుండపోత వర్షంతో విమానాలకు ఇబ్బందులు తలెత్తాయి. సాయంత్రం నుంచి ల్యాండింగ్‌కు వీలు కాకపోవడంతో 10 విమానాలను చైన్నెకి మళ్లించారు. వర్షం తగ్గిన తరువాత మళ్లీ పునరుద్ధరించారు. పలు విమానాలు ఆలస్యమై ప్రయాణికులు అసహనం చెందారు.

సహాయవాణి 1533

వర్షం పడిన ప్రతిసారి పాలికె సిబ్బంది బయటకు రావాలి, రోడ్లలో నీరు నిలవడం, చెట్లు, కొమ్మలు పడిపోతే తక్షణం తొలగించాలని బీబీఎంపీ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ సూచించారు. ప్రజలకు సమస్య తలెత్తితే బీబీఎంపీ సహాయవాణి 1533 నంబరుకు ఫోన్‌ చేసి చెప్పాలని తెలిపారు.

ఉరుములు మెరుపులు, గాలీవాన

కూలిపోయిన చెట్లు

పులకేశినగరలో బాలిక దుర్మరణం

విమాన ప్రయాణాలకు ఆటంకం

కొన్ని ఫ్లైట్లు చైన్నెకి మళ్లింపు

వర్షసూచన

చిక్కమగళూరు, బెంగళూరు, కోలారు, కొడగు, మండ్య, మైసూరు, చామరాజనగర, బీదర్‌ జిల్లా, కొడగు పాటు అనేక జిల్లాల్లో శనివారం వర్షం కురిసింది. ఆదివారం నుంచి వేసవి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒళనాడులో వర్షాలు అధికంగా ఉండవచ్చు.

విరిగిన చెట్లు, కొమ్మలు

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ రోడ్డు కోగిలు క్రాస్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అడ్డంకి ఏర్పడింది. మాన్యతా టెక్‌ పార్కు వద్ద జలమయం అయ్యింది. బెంగళూరు తూర్పు, ఉత్తర భాగం, మహదేవపుర ప్రదేశాల్లో వర్షం, గాలులకు సుమారు 30 నుంచి 50 చెట్లు, చెట్లుకొమ్మలు కూలిపోయాయి. సదాశివనగర 10వ క్రాస్‌లో చెట్లు, కొమ్మలు విరిగిపడటంతో కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. మేక్రీ సర్కిల్‌, సంజయనగర, భూపసంద్ర, యలహంక, హెబ్బాళతో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. జేసీ రోడ్డులో పెద్ద చెట్టు పడిపోయింది.

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం1
1/7

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం2
2/7

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం3
3/7

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం4
4/7

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం5
5/7

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం6
6/7

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం7
7/7

ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement