రాయచూరురూరల్ : ఒపెక్ ఆస్పత్రిలో రోగులకు ఆధునిక వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నీతిష్ తెలిపారు. ఒపెక్ అస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలిసిస్ యంత్రాలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకతోపాటు ఏపీలోని పలు జిల్లాల రోగులకు ఈ ఆస్పత్రిలో వైద్యం అందుతోందన్నారు. గతంలో ఒపెక్‌లో వైద్య సేవలు అందలేదని రోగులు అసంతృప్తికి గురయ్యే వారన్నారు. ప్రస్తుతం రోగులకు అన్ని సౌలభ్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందజేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్యాన్సర్, కార్డియాలజీ, పీడియాట్రిక్, ప్లాస్టిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్టో సర్జికల్, మెడికల్ గ్యాస్ట్రో. పైకో మ్యాక్సిలరీ సర్జరీ సేవలను పునరుద్ధరించినట్లు తెలిపారు. వైద్య సేవలను రోగులు వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ సాగర్, డాక్టర్ రమేష్, విజయ శంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.