హొసపేటె: ఉద్యోగ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని హుడా అధ్యక్షుడు హెచ్‌ఎన్ ఇమామ్ సూచించారు. విజయనగరం జిల్లా వాణిజ్య, పరిశ్రమల మండలి, ఐ.క్యూ.ఎ సంయుక్త ఆధ్వర్యంలో విజయనగర కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉపాధి కోసం తిరుగుతూ అలసిపోయేవారికి ఇలాంటి మేళాలు ఊరట కల్పిస్తాయన్నారు. అదే విధంగా, దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కరం లభిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు. వీరశైవ సంఘం అధ్యక్షులు కణేకల్ మహంతేష్, అరవింద్ పాటిల్, మల్లికార్జున ప్రిన్సిపల్ ప్రభు గౌడ, సంఘం నేతలు అశ్విని కొత్తంబరి, ప్రహ్లాద,, సైయద్ నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.