
చిన్న పరిశ్రమల స్థాపనకు సౌలభ్యాలు
రాయచూరు రూరల్: నగరంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావాలని కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మహపాత్రో కోరారు. నగరం లోని ప్రైవేటు హోటల్‌లో జిల్లా స్థాయి క్లస్టర్ కార్యక్రమాలను ఆయన పార్రంభించి మాట్లాడారు. రాయచూరులో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు సౌలభ్యాలు కల్పించడానికి కార్పొరేషన్ అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చిన్న పరిశ్రమల సంఘం అధ్యక్షుడు రాజగోపాల్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కుమార్, ఏజీఎం కుషాల్, రమేష్, సురేష్, జంబన్న పాల్గొన్నారు.