బబలాది సదాశివప్ప స్వామీజీ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బబలాది సదాశివప్ప స్వామీజీ అరెస్ట్‌

Published Sun, Mar 23 2025 9:12 AM | Last Updated on Sun, Mar 23 2025 9:07 AM

రాయచూరు రూరల్‌: కాల జ్ఞానం చెప్పడంలో అందె వేసిన చెయ్యి, ఉత్త్తర, కళ్యాణ కర్ణాటకలో ప్రసిద్ది చెందిన బబలాది మఠాధిపతి సదాశివ ముత్యాల స్వామీజీని ధార్వాడ నుంచి వచ్చిన నలుగురు సీఐడీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. బాగల్‌కోటె జిల్లా జమఖండిలో నూతనంగా నిర్మించుకున్న మఠాధిపతి సదాశివ ముత్యా స్వామీజీకి ఆపద ఎదురైంది. గోకాక్‌ మహాలక్ష్మి సహకార బ్యాంక్‌లో లావాదేవీల విషయంలో స్వామీజీ ఖాతాలోకి రూ.60 లక్షల్లో వ్యవహారాలు సాగించారు. స్వామీజీ కుమారుడు, భార్య పేరు మీద సాగర్‌ సబకాళే వారి ఖాతాలోకి జమ చేఽశారు. గోకాక్‌ మహాలక్ష్మి సహకార బ్యాంక్‌లో సాగర్‌ సబకాళే ప్యూన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సాగర్‌ సబకాళేతో పాటు పాలక మండటి సభ్యులు మరి కొంత మంది కలసి బ్యాంక్‌ నుంచి రూ.కోట్లాది మేర నిధులను వాడుకున్నారు. బ్యాంకులో రూ.76 కోట్ల మేర అప్పులు తీసుకుని తిరిగి చెల్లించక పోవడంతో ఆర్‌బీఐ అధికారులు నివ్వెర పోయారు.

మూడేళ్లుగా బ్యాంక్‌లో అవ్యవహారాలు

మూడేళ్ల ఆడిట్‌ను పరిశీలించిన ఆర్బీఐ అధికారులు నాటి నుంచి బ్యాంక్‌లో అవ్యవహారాలు జరిగినట్లు నివేదిక ఇచ్చారు. బ్యాంక్‌ నిధుల నుంచి గోకాక్‌, హుబ్లీ, బెళగావిలో స్థలాలు కొనుగోలు చేశారు. దీనిపై కేసు నమోదు చేయడంతో అందరి జాతకాలు బయట పడ్డాయి. రాష్ట్రంలో పేరు గాంచిన పురాతన మఠం విజయపుర జిల్లా బబలాది సదాశివప్ప ముత్యాది ఒకటి కాగా రెండోది మూడు నెలల క్రితం బాగల్‌కోటె జిల్లా జమఖండిలో నూతనంగా నిర్మించుకున్న మఠాధిపతి సదాశివ ముత్యాది. ఈ స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు. గోకాక్‌ మహాలక్ష్మి సహకార బ్యాంక్‌లో రూ.35 వేల కోట్ల టర్నోవర్‌లో రూ.76 కోట్ల అవినీతికి పాల్పడిన వ్యవహారంలో సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 70 శాతం మందికి బ్యాంక్‌ యజమాని, శాసన సభ్యుడు సతీష్‌ జార్కిహోళి వినియోగదారులకు తిరిగి డబ్బులను వాపస్‌ ఇచ్చారు.

రూ.76 కోట్ల నిధుల వంచన కేసు

సీఐడీ అధికారుల సమగ్ర తనిఖీ

సహకార బ్యాంక్‌లో లావాదేవీలు

బబలాది సదాశివప్ప స్వామీజీ అరెస్ట్‌1
1/2

బబలాది సదాశివప్ప స్వామీజీ అరెస్ట్‌

బబలాది సదాశివప్ప స్వామీజీ అరెస్ట్‌2
2/2

బబలాది సదాశివప్ప స్వామీజీ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement