బనశంకరి: కర్ణాటక బంద్‌కు అన్ని జిల్లాల్లో మిశ్రమ స్పందన లభించింది. బెళగావిలో గొడవలకు దిగుతున్న ఎంఈఎస్‌ని నిషేధించడం, కళసా బండూరి, మేకెదాటు పథకం, కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వివిధ డిమాండ్లతో కన్నడ ఒక్కోట అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ శనివారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు.
నగరంలో ర్యాలీ భగ్నం
బెంగళూరులో వాటాళ్ ఆధ్వర్యంలో టౌన్‌హాల్ నుంచి ఫ్రీడం పార్కు వరకు కన్నడ సంఘాల నేతలు, కార్యకర్తలతో భారీ ఊరేగింపు చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వాటాళ్, సా.రా.గోవిందు, కన్నడసేన కుమార్, ప్రవీణ్‌శెట్టి, శివరామేగౌడ తో పాటు ఇతర నేతలు , కార్యకర్తలను నిర్బంధించారు. ఆనందరావ్‌సర్కిల్ వద్ద బీఎంటీసీ, కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను నేతలు అడ్డుకున్నారు.
మామూలుగానే జనజీవితం
బంద్‌ను పట్టించుకోకుండా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఉదయం నుంచి యథావిధిగా సంచరించాయి. బెంగళూరులో సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ఆటోలు మామూలుగా తిరిగాయి. అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. హోటళ్లు, వ్యాపారాలు సజావుగా సాగాయి. పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. జిల్లాల్లో కన్నడ సంఘాల నాయకులు నిరసనలకు దిగారు. మైసూరులో కేఎస్ ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండుగంటలపాటు బస్సుల సంచారం ఆలస్యమైంది. కేంద్రీయ బస్‌స్టేషన్ వద్ద కొంచెం గలాటా జరిగింది. ఎక్కడా ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
బెళగావి, ఇతర జిల్లాల్లో
వివాదానికి మూల కేంద్రమైన బెళగావిలో బంద్ ప్రభావం కనిపించలేదు. కొందరు కన్నడ సంఘాల నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగితే పోలీసులు అడ్డుకున్నారు. చిక్కోడిలో ఉదయం నుంచి వాహనాలు సంచరించంతో పాటు అంగళ్లు తెరిచారు. చామరాజనగర జిల్లాలో బంద్ కనిపించలేదు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా బీదర్‌లో యథా ప్రకారం కార్యకలాపాలు జరిగాయి. ఉడుపిలోను స్పందన కానరాలేదు. బంద్‌కు ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వకపోవడంతో ప్రభావం పడలేదు.
అంతంతగానే కన్నడ సంఘాల
రాష్ట్ర బంద్
ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
బెంగళూరులో టౌన్‌హాల్‌కు
రాకుండా కట్టడి
యథావిధిగా జనజీవనం
హద్దు మీరితే చర్యలు: హోంమంత్రి
బంద్‌లో హద్దులు మీరి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి పరమేశ్వర్ హెచ్చరించారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన పరమేశ్వర్ గొడవలు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే అరెస్ట్ చేయాలని సూచించామని చెప్పారు.
నిరసనలు.. ప్రదర్శనలు
నిరసనలు.. ప్రదర్శనలు
నిరసనలు.. ప్రదర్శనలు
నిరసనలు.. ప్రదర్శనలు