రాయచూరు రూరల్: నీటి గుంటలో పడి విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన దేవదుర్గలో చోటు చేసుకుంది. గురువారం దేవదుర్గ తాలూకా కాకరగల్‌లో సర్కారీ పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మంజునాథ్ కాశీనాథ్(14)గా పోలీసులు గుర్తించారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మంజునాథ్ మల విసర్జనం కోసం వెళ్లి నీటిగుంటలో ఈత కోసం దిగాడు. ఎంతకు పైకి రాకపోవడంతో అక్కడే మరణించాడు. కుటుంబ సభ్యులు వెదికినా కనిపించకుండా పోయాడు. కల్మల– దేవదుర్గ రహదారి పనులకు చేపట్టిన నీటి గుంటలో పడి మరణించాడు. విద్యార్థి మంజునాథ్ మరణంపై కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నుముట్టాయి. పనులు ముగిసి ఏడాది కావస్తున్నా గుంటలను పూడ్చకుండా వదిలి వేయడంతో వాన నీరు వచ్చి నిలబడ్డ గుంటలో పడి మరణించారు.