శివాజీనగర: బెళగావిలో మరాఠాలచే కన్నడిగ బస్ కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ, మరాఠా సంఘాలను నిషేధించాలని, గ్రేటర్ బెంగళూరు పాలనా బిల్లు ను ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలవారు కన్నడిగులపై చేస్తున్న దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ పలు డిమాండ్లతో మార్చి 22న శనివారం కన్నడ సంఘాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌ను విజయవంతం చేయాలని సంఘాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. సిద్దరామయ్య ప్రభుత్వం నుంచి కూడా కన్నడ సంఘాల బంద్‌కు మద్దతు ఉందని సమాచారం.
మద్దతుపై భిన్నగళాలు
22న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు బంద్ జరుగుతుంది. బంద్‌కు కొన్ని పాఠశాలలు, కాలేజీలు మద్దతునివ్వడం వివాదానికి కారణమైంది. కొన్ని సంఘాలు మద్దతు ఇవ్వలేదు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు, వివిధ తరగతుల పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమైంది. పరీక్షల సమయంలో బంద్ వద్దు అని కొన్ని సంఘాలు విన్నవించిన కూడా కన్నడ సంఘాల నేతలు వెనుకంజ వేయబోమని చెప్పారు. 22న జరిగే పరీక్షల పరిస్థితి డోలాయమానంలో పడింది.
వాటాళ్ నిర్బంధం
బంద్ విజయవంతానికి కన్నడ సంఘాల నాయకుడు వాటాళ్ నాగరాజ్ ప్రయత్నిస్తుండగా, పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. గురువారం బెంగళూరులోని మైసూరు బ్యాంక్ సర్కిల్‌లో ధర్నా, ర్యాలీ చేస్తుండగా నిర్బంధించి మళ్లీ విడుదల చేశారు. బంద్ విజయంతం కావాలని వాటాళ్ డిమాండ్ చేశారు.
వెనక్కి తగ్గని కన్నడ సంఘాలు
పరీక్షల గురించి విద్యార్థుల్లో గుబులు