
ఉచితాలు వనితలకేనా..
కృష్ణప్ప మాట్లాడుతూ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు 2 వేలు, తిరిగేందుకు బస్సు ఫ్రీ ఇచ్చింది. ఇస్తున్నది ఖజానా సొమ్మే కదా? మహిళలకు సంతోషం కలిగించినట్లుగానే, పురుషులకు కూడా వారానికి రెండు మద్యం బాటిళ్లను ఉచితంగా ఇవ్వండి, సొసైటీల ద్వారా పంపిణీ చేయాలి అని డిమాండ్ చేశారు. అంతేకాకుండగా రాష్ట్ర ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖకు మద్యం అమ్మకాల లక్ష్యాన్ని పెంచి, ఎకై ్సజ్ ఆదాయాన్ని ఏడాదికి రూ. 40 వేల కోట్లకు పెంచాలనడం పాపపు పని కాదా? అని ప్రశ్నించారు. మహిళలకు ఉచితంగా ఇచ్చి, పురుషుల నుంచి లాక్కోవటం తప్పు కాదా? సంపూర్ణ మద్య నిషేధం అమలు ఎందుకు సాధ్యపడదు? అని తీవ్రంగా వాద–ప్రతివాదనలు జరిగాయి.