బళ్లారిటౌన్: మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రాం, భారతరత్న, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని వైభవంగా జరుపుకోవాలని జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పంచాయతీ నూతన సభాంగణంలో ఏర్పాటు చేసిన ముందస్తు ఏర్పాట్ల సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్‌రాం జయంతిని, 14న బీఆర్ అంబేడ్కర్ జయంతి ఆచరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గత రెండేళ్లుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున మహానీయుల జయంతులను సరళంగా ఆచరించారన్నారు. అయితే ఈసారి వైభవంగా జరుపుకోవాలన్నారు. బాబూ జగ్జీవన్ రాం చర్మ పారిశ్రామిక అభివృద్ధి మండలి అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్ మాట్లాడుతూ తామందరం ఐక్యతతో జయంతులను విజయవంతం చేయాలని సూచించారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమైర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జున, ఎస్పీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా జయంతుల ఆచరణకు తీర్మానం