త్రిశూలం మారణాయుధం కాదు | - | Sakshi
Sakshi News home page

త్రిశూలం మారణాయుధం కాదు

Mar 18 2025 12:14 AM | Updated on Mar 18 2025 12:12 AM

బళ్లారిఅర్బన్‌: త్రిశూలం మారణాయుధం కాదు, యువతుల ఆత్మరక్షణ ఆయుధం అని శ్రీరామసేన చీఫ్‌ ప్రమోద్‌ ముతాలిక్‌ పేర్కొన్నారు. స్థానిక అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 త్రిశూల దీక్ష కార్యక్రమాలను జరిపామన్నారు. ఐదు అంగుళాల త్రిశూలం శివుడి చేతిలోని వస్తువు అని, అది మారణాయుధం కాదని అన్నారు. త్రిశూలాన్ని హిందూ యువతులు ఆత్మరక్షణకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. హిందూ ధర్మానికి 16 వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఇస్లాం ధర్మానికి 15 వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఏది మొదలన్నది మీరే ఆలోచించి

ఇస్లాం ధర్మ, అలాల్‌కట్‌, లవ్‌ జిహాద్‌ ఆచరణల ద్వారా హిందూ మతంపై ఒత్తిడి తేవడం ఎట్టి పరిస్థితిలోను సహించబోమన్నారు. దేశంలో సకాలంలో జరగని న్యాయం వల్ల ఎక్కువగా సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ద్రోహులు, ఉగ్రవాదులు చెలరేగి పోతున్నారన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి భయపడటం లేదు.

ఇందిరా గాంధీ కేసులో న్యాయం ఆలస్యం

ఇందిరా గాంధీ హత్య జరిగాక సుమారు 40 ఏళ్ల వరకు సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు తీరుతో న్యాయం ఆలస్యం అయిందని ఆయన న్యాయాంగం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ సంప్రదాయంలో ఎన్నో విశిష్టమైన ఆచారాలలో కుంకుమ ధరించడం, పూలు పెట్టుకోవడం వంటి వాటిని కూడా కొన్ని విద్యా సంస్థలు అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మహిళలు గాజుల ధారణ, కుంకుమ పెట్టుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని వాపోయారు. హిందూ యువతులు వారి తల్లిదండ్రులు హిందూ ధర్మాన్ని పాటించడం ద్వారా భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ సర్కారు ముస్లింల ఓటు బ్యాంక్‌ కోసం ప్రతి విషయంలోను వారికి రిజర్వేషన్లు కల్పించి కుహనా రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఈ విషయమై కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో శ్యాంసుందర్‌, సుగుణ సునంద హిరేమఠ, జనతా హోటల్‌ గురురాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

యువతుల ఆత్మరక్షణ ఆయుధం

శ్రీరామసేన చీఫ్‌ ప్రమోద్‌ ముతాలిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement