రాయచూరు రూరల్: జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వీరనగౌడ పాటిల్ పదవీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో రాయచూరు శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అధ్యక్ష బాధ్యతలను వీరనగౌడ పాటిల్‌కు కట్టబెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంచాలకుడు బసవరాజ్ ముత్తిమోడ మాట్లాడుతూ త్వరలో జరగనున్న జెడ్పీ, టీపీ, నగరసభ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి అభ్యర్థుల విజయానికి సహకరించి కార్యకర్తలను సమాయత్తం చేయాలన్నారు. సమావేశంలో అధ్యక్షురాలు లలిత, మాజీ ఎంపీ బీవీ నాయక్, శాసన సభ్యుడు వజ్జల్ మానప్ప, మాజీ శాసన సభ్యులు పాపారెడ్డి, గంగాధర నాయక్, బసనగౌడ, ప్రతాప్ పాటిల్, అమర్‌నాథ్ పాటిల్, నేతలు శంకర గౌడ, యల్లప్పలున్నారు.
ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం
రాయచూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం పాలైన ఘటన నగర శివార్లలో జరిగింది. తాలూకాలోని బాయిదొడ్డి ప్రభుత్వ పాఠశాలలో ప్యూవన్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోష్(35) సోమవారం రాయచూరు నుంచి ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న బొలెరోను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. మార్కెట్ యార్డు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా కోసం రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
చెట్టుకు కారు ఢీ..
ముగ్గురి మృతి ●
● విజయపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం విజయపుర తాలూకా ఉన్నాళ గ్రామానికి చెందిన బీరప్ప(30), హనుమంతు (25), యమునప్ప(28) అనే ముగ్గురితో పాటు మరో ఇద్దరు కారులో బయల్దేరారు. విజయపుర సమీపంలో చెట్టుకు కారు ఢీకొంది. దీంతో ఘటన స్థలంలోనే బీరప్ప, హనుమంతు, యమునప్ప అనే వ్యక్తులు మృతి చెందారు. ఉమేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై విజయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ
సభ్యుడు అరెస్టు
చెళ్లకెరె రూరల్: లైంగిక దౌర్జన్యం, కులదూషణ ఫిర్యాదుపై జీపీ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన చిత్రదుర్గలో జరిగింది. చిత్రదుర్గ తాలూకా సిరిగెరె గ్రామ పంచాయతీ సభ్యుడు దేవరాజ్ పోలీసు కస్టడీలో ఉన్నారు. ఇతను కులదూషణ చేస్తున్నాడని గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు, పీడీఓలను లైంగికంగా హింసించాడని పంచాయతీ క్లర్క్ జయరాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
హొసపేటె: టీబీ డ్యాం పీఎల్‌సీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అమృత నగరోత్తాన– 4 పథకం కింద మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే గవియప్ప భూమిపూజను నెరవేర్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు రూ.32.35 లక్షల ఖర్చుతో బిల్డింగ్ పునరుద్ధరణ, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. గుత్తేదారులు అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. నగరసభ అధ్యక్షుడు రూపేష్‌కుమార్, ఉపాధ్యక్షుడు రమేష్ గుప్తా, హుడా అధ్యక్షుడు హెచ్‌ఎన్‌ఎఫ్ ఇమామ్, నగరసభ సభ్యులు జీఎస్ హనుమంతప్ప(బుజ్జి), సర్వనన్న, బీఈఓ చెన్నబసప్ప, హెచ్‌ఎం శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు నిర్మల, హేమలత, రవి, మంజుల, శారద, విద్యార్థులు పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకారం
బాధ్యతల స్వీకారం
బాధ్యతల స్వీకారం