హొసపేటె: తాలూకాలోని ఆనెగుంది సమీపంలోని తుంగభద్ర నది మధ్యలో ఉన్న చారిత్రాత్మక, ధార్మిక ప్రఖ్యాతి గాంచిన నవబృందావన కొండ వద్ద మధ్వ సంప్రదాయానికి చెందిన యతివర్య సుధీంద్ర తీర్థం పుచ్చుకుని విశేష పూజలు చేశారు. మంత్రాలయ రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబుధేంద్ర, పాదరాజర మఠ పీఠాధిపతి సుజయనిధి తీర్థుల సమక్షంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు జరిగాయి. బృందావనానికి నిర్మల్య విసర్జన, పంచామృత అభిషేకం, విశేష పుష్పాలంకరణ, అష్టోత్తర పారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా గురురాజ ఆచార్, అనంత, గుంజళ్లి మురళి, ప్రకాష్ కరణం, గోపి, శామ, ప్రవీణ్ ఆచార్, వి.కులకర్ణి, ఆనెగుంది అర్చకుడు విజయేంద్ర చల్లర్, శ్రీనివాసాచార్యులు, మేనేజింగ్ డైరెక్టర్ సుమంత కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.