చిక్కసూగూరు వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ | - | Sakshi
Sakshi News home page

చిక్కసూగూరు వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌

Mar 17 2025 10:58 AM | Updated on Mar 17 2025 10:52 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలో పురాతన చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్‌ ఆదేశించారు. నగరంలోని గొల్లకుంట చెరువును ఆదివరం ఆయన పరిశీలించి మాట్లాడారు. నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్ధశ కల్పించడానికి బడ్జెట్లో నిదులు కేటాయించినట్లు తెలిపారు. రాంపూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్ద అదనంగా 10 ఏకరాలు, చిక్క సూగురు వద్ద 50 ఏకరాల విస్తీర్ణంలో కొత్తగా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణాలకు సర్వేలు చేయాలని అదేశించామన్నారు. రాయచూరు విజ్ఞాన కేంద్రంలో ఉప కేంద్రాల నిర్మాణాలకు ప్రతి పాదనలు సిద్దం చేయాలని కలెక్టర్‌ నితీష్‌కు మంత్రి సూచించారు. ఎంపీ కుమార నాయక్‌ పాల్గొన్నారు.

నగర అభివృద్ధికి సహకరించండి

రాయచూరు రూరల్‌: నగర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఎమ్మెల్సీ వసంత్‌ కుమార్‌ అన్నారు. నగరంలోని 21వ వార్డు ప్రధాన రహదారిలో రూ.2.5 కోట్లతో సీసీ రోడ్డు, తాగునీటి ట్యాంకు నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నగరసభ సభ్యుడు నాగరాజ్‌, నేతలు ఖరీమ్‌, అస్లాం పాషా, పరుశు రామ్‌, నాగిరెడ్డి, రజాక్‌ ఉస్తాద్‌ పాల్గొన్నారు.

రుణ కంతులు చెల్లించాలని వేధింపులు

మైక్రో ఫైనాస్‌ సిబ్బందిపై కేసు నమోదు

హుబ్లీ: అప్పులు తీర్చాలని అసభ్యంగా నిందించి వేధించిన సూక్ష్మరుణ సంస్థ ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధార్వాడ తాలూకా చిక్కమల్లిగవాడ గ్రామంలో పలువురు మహిళలు సూక్ష్మరుణ సంస్థలో రుణాలు తీసుకున్నారు. కంతులు తీర్చడానికి గడువు కావలని విజ్ఞప్తి చేశారు. అయితే సిబ్బంది వెళ్లి మహిళలను వేధించారు. బాధితులు సహయవాణికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జిల్లాధికారి దివ్య ప్రభు స్పందించారు. సదరు ఫైనాన్స్‌ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు నీలవ్వ మాట్లాడుతూ మేము కష్టాన్ని నమ్ముకొని జీవనంసాగిస్తున్నామని, పనికి వెళ్లిన చోట్లకు ఫైనాన్స్‌ సిబ్బంది వచ్చి నిందిస్తున్నారని వాపోయింది.

గుజరీ దగ్ధం

హొసపేటె: విజయనగర జిల్లా హడగలిలో గుజరి దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి లక్షల రూపాయల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. మటన్‌ మార్కట్‌ సమీపంలోని గుజరీలో ఆదివారం చిన్నపాటి మంటలు చెలరేగాయి. వెంటనే కార్మికులు బయటకు పరుగులు తీశారు. మంటలు వ్యాపించి వస్తు సామగ్రి కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. హడగలి సీఐ దీపక్‌ భూసారెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు.

దొంగల అరెస్ట్‌, ధాన్యం స్వాధీనం

హుబ్లీ: రైతులు ఆరుగాలం శ్రమించి పండించి పొలాల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని చోరీ చేసిన ఐదుమంది నిందితులు పట్టుబడ్డారు. దుర్గప్ప, గంగాధర, మహంతేష, అమిత్‌, అభిషేక్‌ నరేగల్‌ అనే నిందితులను హావేరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులనుంచి 10.27 లక్షల విలువైన 54 క్వింటాళ్ల జొన్నలు, 21 క్వింటాళ్ల మొక్కజొన్న, 30 క్వింటాళ్ల సావె, 5 క్వింటాళ్ల శెనగ, రెండు క్వింటాళ్ల గోధుములు, బోలెరో వాహనం, బైక్‌ను జప్తు చేశారు. నిందితులను విచారణ చేపట్టగా శిగ్గావి, బంకపూర, హులగూరు, హవేరి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన 9 చోరి కేసులు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.

చిక్కసూగూరు వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌1
1/3

చిక్కసూగూరు వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌

చిక్కసూగూరు వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌2
2/3

చిక్కసూగూరు వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌

చిక్కసూగూరు వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌3
3/3

చిక్కసూగూరు వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement