● రాష్ట్రమంతటా హోలీ సంబరాలు
బనశంకరి: సిలికాన్ సిటీతో పాటు రాష్ట్రం నలుమూలలా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. శనివారం వేసవి ఎండలను సైతం లెక్కచేయకుండా పిల్లలు, యువతీ యువకులు, కుటుంబ సభ్యులు రంగు నీళ్లు చల్లుకుని, రంగులు అద్దుకుని చిందులు వేశారు. కొన్నిచోట్ల వీధుల్లో నృత్యాలు చేస్తూ, డీజీ చప్పుళ్ల మధ్య ఆనందోత్సవాలలో మునిగిపోయారు. బెంగళూరు నగరవ్యాప్తంగా అపార్టుమెంట్లు, వసతి సముదాయాలు, ఇళ్లు, పాఠశాల కాలేజీ, హోటళ్లు, మైదానాల్లో హోలీని కేరింతలతో సంతోషంగా చేసుకున్నారు. వివిధ లేఔట్లలో కులమత భేదాలతో సంబంధం లేకుండా ఆచరించారు. రోడ్లు రంగులతో కళకళలాడాయి. చిన్నపిల్లలు పిచికారితో పెద్దలపై రంగులు చల్లారు. నగరంలోని ఉత్తర కర్ణాటక ప్రజలు కామ దహనం చేసి రంగోళి ఆడారు. కొన్నిచోట్ల విదేశీ టూరిస్టులు రంగుల పండుగలో పాల్గొన్నారు. ప్రైవేటు కంపెనీల ఆఫీసుల్లో సంబరాలు జోరుగా జరిగాయి. యువకులు గుంపులుగా ద్విచక్రవాహనాల్లో తిరుగుతూ రంగులు చల్లుకున్నారు. డీజే డ్యాన్సుల సంబరం మిన్నంటింది. మరోవైపు హుబ్లి– ధార్వాడ, బెళగావి సహా ఉత్తర కర్ణాటక నగరాలలో స్థానిక సంఘాల ఆధ్వర్యంలో సామూహిక హోలీ వేడుకల వైభవం చెప్పనలవి కాదు. ధార్వాడలో వేలాది మంది ఒకచోట చేరి రంగుల వర్షంలో తడిసిపోయారు.
రంగు రంగులు.. ఉత్సాహం పొంగులు
రంగు రంగులు.. ఉత్సాహం పొంగులు
రంగు రంగులు.. ఉత్సాహం పొంగులు
రంగు రంగులు.. ఉత్సాహం పొంగులు
రంగు రంగులు.. ఉత్సాహం పొంగులు
రంగు రంగులు.. ఉత్సాహం పొంగులు
రంగు రంగులు.. ఉత్సాహం పొంగులు