
ఉపాధ్యాయుడికి ఘనంగా వీడ్కోలు
మండ్య: తాలూకాలోని కట్టెదొడ్డి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు టీ.రవిశంకర్‌కు గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ శంకరేగౌడ మాట్లాడుతూ.. ఒకే పాఠశాలలో ఇన్నేళ్లపాటు సేవలందించడం చాలా అరుదు అన్నారు. ఉపాధ్యాయుడు రవిశంకర్ ఉత్తమ బోధన తీరుతో విద్యార్థులు, గ్రామస్తుల మనస్సు గెలుచుకున్నారన్నారు. సన్మాన గ్రహీత రవిశంకర్ మాట్లాడుతూ... గత 28 ఏళ్లుగా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించడం తనకెంతో తృప్తి కలిగించిందన్నారు. ఇదే పాఠశాలలో తన వృత్తి జీవితం ప్రారంభమై, ఇక్కడే ముగియడం తన అదృష్టమన్నారు. అంతకు ముందు గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఎడ్లబండిపై జానపద కళాబృందాలతో రవిశంకర్ దంపతులను ఊరేగింపుగా వేదిక వద్దకు పిలుచుకొచ్చారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామస్తులకు అన్నసంతర్పణ చేశారు.