హోసూరు: కొరియర్ ద్వారా డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని, దీనిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బు చెల్లించాలని బెదిరించి రూ. 7.27 లక్షలను కాజేశారు సైబర్ దొంగలు. వివరాల మేరకు జిల్లా కేంద్రం క్రిష్ణగిరి కో ఆపరేటివ్ కాలనీకి చెందిన ప్రమోద్ (35) అదే ప్రాంతంలో కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గత నెల 27వ తేదీ అతనికి దుండగులు కాల్ చేసి, ముంబై పోలీసులం మాట్లాడుతున్నామని చెప్పారు. మీ పేరు మీద భారీఎత్తున మాదక ద్రవ్యాలు కొరియర్ ద్వారా పార్సిల్ వచ్చాయని తెలిపారు. మీపై కేసు నమోదు పెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలన్నారు. అలా అతన్ని ఒత్తిడి చేసి రూ. 7.27 లక్షలను వసూలు చేశారు. తర్వాత దుండగుల నంబర్‌కు కాల్‌చేయగా స్విచాఫ్ అని వచ్చింది. దీంతో ఏదో మోసం జరిగిందని తెలిసి అతను క్రిష్ణగిరి క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


