
అదొక ఆస్పత్రి, ఎంతోమంది రోగాలు, కాళ్లు చేతులకు గాయాలతో చికిత్స కోసం దీనంగా వస్తుంటారు.
కర్ణాటక: అదొక ఆస్పత్రి, ఎంతోమంది రోగాలు, కాళ్లు చేతులకు గాయాలతో చికిత్స కోసం దీనంగా వస్తుంటారు. కానీ మెడికోలకు ఇదేమీ పట్టదు, వారి ఆనందం వారిదే. గదగ్‌లోని ప్రభుత్వ జిమ్స్ ఆస్పత్రిలో రీల్స్ చేసిన 38 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. వీరందరూ జిల్లా ఆస్పత్రి కారిడార్‌లో కన్నడ సినిమా పాటకు నృత్యం చేసిన వీడియో వైరల్ అయింది.
ఆస్పత్రి విధుల సమయంలో రోగులకు చికిత్స చేయకుండా వీడియోలు తీసుకుంటూ హల్‌చల్ చేశారని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వీడియోలు తీసుకోవడానికి ఆస్పత్రి తప్ప మరో జాగా లేదా అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. దీంతో జిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బసవరాజ బొమ్మనహళ్లి వారిని 10 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు అని తెలిపారు.
38 Medical Students from Gadag Institute of Medical Sciences in Gadag district of #Karnataka were suspended by the institute after their social media #Reels shot inside the hospital went viral .. They shot these videos inside the hospital during duty hours. pic.twitter.com/YOW8I893Ig
— Smriti Sharma (@SmritiSharma_) February 10, 2024