
విద్యార్థులకు ప్రమాణ పత్రాలు అందించిన దృశ్యం
కోలారు: విద్యార్థులు శాసీ్త్రయ మనోభావాన్ని పెంచుకోవాలని, విజ్ఞాన పోటీల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని మొరార్జీ దేశాయి వసతి పాఠశాల ఉపాధ్యాయిని సుగుణ తెలిపారు. ఆదివారం తాలూకాలోని సోమయాజులపల్లికి చెందిన మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో నిర్వహించిన విజ్ఞాన వస్తు ప్రదర్శన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పోటీల్లో గెలుపు ఓటములను విద్యార్థులు సమానంగా తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలన్నారు. అనంతరం జిల్లా స్థాయి వస్తు ప్రదర్శన పోటీల్లో విజేతలై రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు ఎంఎస్ హేమంత్, ఆర్ యశ్వంత్ కుమార్‌లకు ప్రమాణ పత్రాలను అందించారు. కార్యక్రమంలో విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు వి శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.