
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
హుబ్లీ: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు సీసీ సర్కారు ఉన్నట్లే, సీసీ అంటే కరప్షన్, క్యాపిటేషన్ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో పరస్పరం బురదజల్లుకోవడం చూస్తుంటే అంతా తేటతెల్లం అవుతోందన్నారు. ఈ విషయంలో తానేమీ ఎక్కువ మాట్లాడబోనన్నారు. కాంగ్రెస్‌లో అంతా సరిగ్గా లేదన్న విషయాన్ని బీకే.హరిప్రసాద్ స్పష్టంగా చెప్పారన్నారు.సర్కారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిందన్నారు. తన నియంత్రణ కోల్పోతోందన్నారు. పార్టీలో పరస్పరం బురదజల్లుకోవడం ఆగలేదన్నారు. అసమ్మతి వల్ల పాలనపై పరిణామాలు పడ్డాయన్నారు. అందుకే ఇది సీసీ సర్కారు అని ఆయన ఎద్దేవా చేశారు. ఇదే సర్కారు అభివృద్ధి అన్నారు. ప్రధాన మోదీ కేంద్రం తరపున 5 కేజీల బియ్యం ఇస్తుంటే రాష్ట్రంలోని పాలనకు ఒక కేజీ బియ్యాన్ని కూడా దానికి అదనంగా ఇవ్వడం లేదు. దీన్నే అన్నభాగ్య పథకం అంటూ అసత్య ప్రచారం చేసుకుంటున్నారన్నారు. బెంగళూరు ప్యాలెస్‌లో జరుగుతున్న ఈడిగ సమావేశం గురించి మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయమై హరిప్రసాద్ మాట్లాడారన్నారు. కాంగ్రెస్‌లో తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసే వారికి గురించి మాట్లాడే సత్తా హరిప్రసాద్‌కు లేదన్నారు. అందుకే ఆయన బీజేపీని నిందిస్తున్నారన్నారు. ఈ మతలబ్‌లు చేసేది సిద్దరామయ్యేనని, మాట్లాడే శక్తి హరిప్రసాద్‌కు లేదని అన్నారు. ఆయన సర్కారుపై ఎంత మేర రేగుతారో దాన్ని బట్టి సమాధానం ఇస్తానని ప్రహ్లాద్‌జోషి కాంగ్రెస్ రాజకీయాల గురించి తనదైన శైలిలో మండిపడ్డారు.