
బనశంకరి: సీ్త్రత్వ (సీ్త్రతత్వం) పేరుతో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రదర్శన నగరవాసులను కనువిందు చేస్తోంది. పాతమద్రాసురోడ్డులో వసంత్ ఆర్ట్‌గ్యాలరీలో ప్రముఖ చిత్రకారుడు సౌరభ్‌సదానంద్ డింగరే సీ్త్రత్వ (సీ్త్రతత్వం) పేరుతో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రదర్శనలో వివాహం చేసుకుని అత్తవారింట్లోకి అడుగుపెట్టిన యువతి ఇతివృత్తంగా చేసుకుని గీసిన చిత్రాలు ఆలోచనలో పడేస్తున్నాయి. ఒంటరిగా తన బాధ్యతలు నిర్వహించుకోవడం, భర్త కోసం ఎదురుచూపులు, అత్తమామలకు సేవలు చేయడం, సంతానం అనంతరం పెరిగిన బాధ్యతలపై తన మనసులోని భావాలను ఇతివృత్తంగా చేసుకుని కళాకారుడు సౌరభ్‌సదానంద్‌డింగరే నవ్యమైన చిత్రాలను గీశారు. మహిళ దేవతగా, యుద్ధవీరులుగా, ప్రేమను పంచే అమ్మగా, కళాకారిణిగా బహుముఖపాత్రలను ఏకకాలంలో పోషించే సీ్త్రగా ఒకేసిరీస్‌లో గీసిన పెయింటింగ్స్ సౌరబ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన వచ్చే ఏడాది ఫిబ్రవరి 29 వరకు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకు ప్రదర్శన వీక్షించవచ్చు.

