
ఢీకొన్న బస్సులు
యశవంతపుర: రెండు కేఎస్ ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా మాకోనహళ్లి గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగింది. రెండు బస్సులు అతివేగంగా రావటంతో ప్రమాదం జరిగింది. ఘటనలో 20 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్లు ఇద్దరు గాయపడ్డారు. బస్సుల ముందు భాగం దెబ్బతింది. గాయపడిన ప్రయాణికులను మూడిగెరె ఆస్పత్రికి తరలించారు.
బస్సులు లేక భక్తులు ఆందోళన
దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థలలో జరుగుతున్న లక్ష దీపోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అయితే ధర్మస్థలకు వెళ్లే భక్తులకు బస్సుల సౌకర్యం లేక చిక్కమగళూరులో అనేక ఇబ్బందు పడ్డారు. శనివారం అర్ధరాత్రి చిక్కమగళూరు నగరం నుంచి ధర్మస్థలకు బస్సు సౌకర్యం లేని కారణంగా వందల మంది భక్తులు ఇబ్బందుకుల గురయ్యారు. బస్సులు రాకపోవటంతో కడూరు–మంగళూరు జాతీయ రహదారిలో ఆందోళన చేశారు.