
సస్పెండైన పీడీఓలు
రాయచూరు రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ కూలీ కార్మికులకు ఉపాధి కల్పించకుండా నిధులు దిగమింగిన నలుగురు పీడీఓలను సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఆయన ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. 2020–21, 2022–23ల్లో దేవదుర్గ తాలూకాలో టీపీ అసిస్టెంట్ డైరెక్టర్, ఈఓలు రూ.11 కోట్లు, 95 మంది పీడీఓలు, 6,623 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిసి రూ.200 కోట్ల మేర నిధుల దుర్వినియోగంపై విచారణ చేశామన్నారు. మొదటి విడతలో జాలహళ్లి పీడీఓ పత్యప్ప రాథోడ్, గాణదాళ పీడీఓ మల్లప్ప, కొత్తదొడ్డి పీడీఓ సి.బి.పాటిల్, శావంతగేర పీడీఓ గురుస్వామిలను సస్పెండ్ చేశామన్నారు.