రాజకీయాలు వద్దు, సినిమాలే ముద్దు | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలు వద్దు, సినిమాలే ముద్దు

Dec 11 2023 12:38 AM | Updated on Dec 11 2023 12:38 AM

బనశంకరి: తన తండ్రి బాటలోనే తాను సినిమాల్లో నటించడం వరకు మాత్రమేనని, తనకు రాజకీయాలు వద్దని హ్యాట్రిక్‌ హీరో శివరాజ్‌కుమార్‌ స్పష్టం చేశారు. లోకసభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీకే.శివకుమార్‌ వ్యాఖ్యలపై స్పందించిన శివరాజ్‌కుమార్‌ తన తండ్రి ఇచ్చిన దారిని ఎంచుకుని కొనసాగుతానని, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరమని చెప్పారు. బంగారప్ప కుమార్తె మా ఇంటి కోడలు గీతకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావచ్చని, భార్యకు అన్ని విధాలుగా సహకరించడం భర్త విధి అన్నారు. గీత ఇష్టపడితే ఎన్నికల్లో అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. 75వ ఈడిగ సముదాయ కార్యక్రమంలో ఉన్నత వ్యక్తులు ఉండాలి కాని లేరని వారి ఆశీర్వాదం ఉందన్నారు. తమ డిమాండ్లు సిద్దరామయ్య ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement