
ఆలయం ముందు రథోత్సవ సంరంభం
మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మైసూరు జిల్లాలోని నంజనగూడులో వెలసిన శ్రీకంఠేశ్వర (నంజుండేశ్వర) స్వామి చిన్న జాతర వేడుకలు జన సాగరం మధ్య జరిగాయి. చిన్న జాతర వేడుకల సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున ఆలయంలో పార్వతీ సమేత శ్రీకంఠేశ్వర స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాలతో అభిషేకించారు. మహావ్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు నాగచంద్ర దీక్షిత్ ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు గావించారు. గణపతి పుజ, నవగ్రహాల పూజ చేసి ఉత్సవమూర్తిని తేరులో ఉంచి రథోత్సవం ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంతో పాటు పట్టణ వీధుల్లో భక్తులు తేరును లాగారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.
జనసాగరమైన నంజనగూడు

పట్టణ వీధుల్లో సాగిన తేరు
Comments
Please login to add a commentAdd a comment