
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులు
● సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుళ్లకు గాయాలు
● ధార్వాడ జిల్లా నరేంద్ర గ్రామంలో ఘటన
హుబ్లీ: దీపావళి పండగ వేళ జూదం ఆడుతున్న గుంపుపై దాడి చేసిన పోలీసులపైనే ప్రతి దాడి చేసిన ఘటన ధార్వాడ తాలూకా నరేంద్ర గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి 1 గంటకు అధికారులు బందోబస్తులో ఉండగా గ్రామంలో పేకాట ఆడుతున్న సమాచారం అందడంతో ఎస్‌ఐ నాగరాజ పాటిల్ ఆధ్వర్యంలో ధార్వాడ గ్రామీణ పోలీసు సిబ్బంది పేకాట అడ్డాపై దాడి చేశారని ధార్వాడ జిల్లా ఎస్పీ గోపాల బ్యాకోడ్ తెలిపారు. ఈ వేళ ఎస్‌ఐ, సిబ్బందిపై కొందరు ప్రతి దాడి చేశారన్నారు. కానిస్టేబుల్ నాగరాజ్ తలకు, ఎస్‌ఐ బసవనగౌడ చేయికి, గొంతుకు గాయాలయ్యాయన్నారు. వీరిద్దరూ ధార్వాడ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఈ ఘటనపై ధార్వాడ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి 8 మందిని అరెస్ట్ చేశారన్నారు. మిగతా వారి కోసం గాలింపు సాగుతోందన్నారు. మొత్తం 10 మంది అనుమానితులు ఉన్నారన్నారు. మూడు రోజుల్లో 27 పేకాట అడ్డాలపై దాడి చేసి 236 మందిని అరెస్ట్ చేసి రూ.3.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment