
హంపీలోని దీపావళి వేడుకలు
రాయచూరు రూరల్: జిల్లాలో సిరివార, నవలకల్, కల్మల తదితర చోట్ల అకాల వర్షాలతో నేలకొరిగిన రైతుల చేతికొచ్చిన వరి పంటను మంగళవారం జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర వైద్యవిద్యా శాఖా మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ అధికారులతో కలిసి పరిశీలించారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోవడం ఒక ఎత్తయితే వందలాది ఎకరాల్లో అకాల వర్షాలతో చేతికొచ్చిన వరి పైరు నేలకొరిగి నష్టపోయిన వైనాన్ని, తమ కష్టాలను రైతులు మంత్రికి వివరించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
ఏఐ టెక్నాలజీతో
విజయనగర వైభవం వైరల్
హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీలో విజయనగర సామ్రాజ్యం కాలంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకొనేవారనే విషయంపై ఏఐ టెక్నాలజీ ద్వారా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నేలకొరిగిన పంటను పరిశీలిస్తున్న మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ తదితరులు