సత్వరమే కరువు పరిహారం | Sakshi
Sakshi News home page

సత్వరమే కరువు పరిహారం

Published Thu, Nov 9 2023 1:06 AM

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే తదితరులు - Sakshi

కంప్లి: రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్రానికి పలుమార్లు ద్వంద్వ సమాచారం పంపించడంతో ఇంతవరకు కరువు పరిహారం ఆలస్యం అయిందని ఎమ్మెల్యే కే.నేమిరాజ నాయక్‌ ఆరోపించారు. కొట్టూరు పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద పీడబ్ల్యూడీ శాఖ పరంగా నిర్మించనున్న 45 మీటర్ల ఎత్తు కలిగిన ధ్వజస్తంభ నిర్మాణానికి భూమిపూజ జరిపి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కరువు తాలూకాలను ప్రకటించినా పరిహారం అందించలేదన్నారు. అదే విధంగా కేంద్ర బృందం కూడా పర్యటించినందున త్వరలో కరువు పరిహారం విడుదల చేయాలన్నారు.

సందడిగా

హలో పేరెంట్స్‌

హొసపేటె: విజయనగర జిల్లా కమిషనర్‌ కార్యాలయ హాలులో సోమవారం తల్లిదండ్రులకు పౌష్టికాహారంపై నిర్వహించిన హలో పేరెంట్స్‌ కార్యక్రమం విజయవంతమైంది. డిప్యూటీ కలెక్టర్‌ అనురాధ హలో పేరెంట్స్‌ కార్యక్రమానికి సంబంధించిన సమాచార పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లల చదువు మొగ్గలోనే ఎదుగుతుందన్నారు. వారి చదువును బలోపేతం చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమన్నారు. కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.శ్వేత, మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ అర్చన తదితరులు పాల్గొన్నారు.

టీబీ డ్యాంలోకి ఇన్‌ఫ్లో రాక

సాక్షి, బళ్లారి: హడగలి తాలూకాలోని సింగటాలూరు ఎత్తిపోతల పథకం నుంచి తుంగభద్ర డ్యాంలోకి 5,365 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి సింగటాలూరు డ్యాంలోకి నీటి ప్రవాహం పెరగడంతో డ్యాంలోకి నీటి రాకపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈనేపథ్యంలో హెచ్‌ఎల్‌సీకి నీటి విడుదల ఈనెల 20 వరకు కొనసాగే అవకాశం ఉందని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ ఆశాభావం వ్యక్తం చేశారు.

సింగటాలూరు నుంచి నీరు వదిలిన దృశ్యం
1/1

సింగటాలూరు నుంచి నీరు వదిలిన దృశ్యం

Advertisement
Advertisement