
నివాళులర్పిస్తున్న సీఎం, డీసీఎంలు
● సీఎం నివాళులు
శివాజీనగర: జాతిపిత మహాత్మాగాంధీ భారత్‌కు మాత్రమే కాదు, విశ్వ నాయకుడని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. సోమవారం గాంధీజీ 154వ జయంతి సందర్భంగా విధానసౌధ ముందు గాంధీజీ చిత్రపటానికి పుష్పమాలను సమర్పించి నివాళులర్పించారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి అని, వారి జీవితం మనందరికీ స్ఫూర్తి కావాలని పిలుపునిచ్చారు. లాల్‌బహుద్దూర్ శాస్త్రి దేశంలోనే అత్యంత నిజాయితీ కలిగిన ప్రధానమంత్రిగా ఉన్నారన్నారు.
గాంధీజీని కించపరిస్తే చర్యలు
గాంధీజీని అవమానపరిచేలా ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శానససభ వ్యవహారాల శాఖామంత్రి హెచ్‌కే.పాటిల్ తెలిపారు. దేశంపై అభిమానం లేనివారు గాంధీజీని కించపరుస్తారని, సత్యం మాట్లాడటం, శాంతియుతంగా ఉండటం, అందరినీ సమానంగా చూడడం కష్టమైన పనేమీ కాదన్నారు. కాగా, గాంధీ జయంతి రాష్ట్రమంతటా ఆచరించారు. పలుచోట్ల బాలల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.