
రక్తదానం చేస్తున్న ఆశా కార్యకర్తలు
గంగావతి: అన్ని దానాల్లోకి రక్తదానం పవిత్రమైందని డాక్టర్ సబ్రిన్ పేర్కొన్నారు. నగరంలోని ఇస్లాంపురలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రధానంగా మనిషి మరొకరి ప్రాణాలను కాపాడేందుకు కన్ను, కిడ్నీ, రక్తదానం లాంటివి చేయాలన్నారు. శిబిరంలో 100 మంది రక్తదానం చేయడం శ్లాఘనీయం అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్, నేత్రావతి, ఆశా కార్యకర్తలు దీపా, శరణమ్మ, లాల్‌బీ తదితరులు పాల్గొన్నారు.