
నూతన కార్యవర్గాన్ని సన్మానిస్తున్న దృశ్యం
గంగావతి: పీఎల్‌డీ బ్యాంక్ అధ్యక్షుడుగా వరుసగా మూడు సార్లు గెలుపొందిన దొడ్డప్ప దేశాయిని కారటగి పట్టణంలో టీఏపీఎంసీ వారు సన్మానించారు. శనివారం జరిగిన టీఏపీఎంసీ వార్షికోత్సవంలో ఆయన సన్మానాన్ని అందుకొని మాట్లాడుతూ తమ సహకార సంఘం ద్వారా ప్రజలకు అవసరమైన రుణ సౌకర్యాలను వ్యాపారస్తులకు, నిరుద్యోగ యువతకు సైతం రుణాలు కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి పాటు పడుతోందన్నారు. రాష్ట్రంలో సగానికి పైగా సహకార సంఘాల ద్వారా ప్రజలకు రుణ సౌకర్యం లభిస్తోందన్నారు. తాలూకాలో కూడా సహకార సంఘాలు ముందంజలో ఉన్నాయన్నారు.