రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(ఆర్డీసీసీ) ముదగల్ బ్రాంచ్ మేనేజర్ శివపుత్రప్పను అకారణంగా తొలగించడం తగదని హడపద సమాజం కార్యకర్తలు డిమాండ్ చేశారు. శనివారం ఆ సమాజం అధ్యక్షుడు జగన్నాథ్ ఆర్డీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు విశ్వనాథ్ పాటిల్ తోరణదిన్నికి వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. 19 ఏళ్లుగా బ్యాంక్‌లో సేవలందించి రైతులకు అందించిన రుణాల వసూలులో ముందంజలో ఉన్నారని పదోన్నతి కల్పించి నేడు ఉన్నఫళంగా ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదన్నారు. ఐదేళ్లుగా బ్రాంచ్ మేనేజర్ హోదాలో రూ.19 కోట్ల మేరకు బ్యాంక్‌కు లాభాలు తెచ్చిపెట్టారన్నారు. రాయచూరుకు బదిలీ చేసిన 45 రోజుల అనంతరం రుణాల విషయంలో బ్యాంక్ నుంచి తొలగించామని ఆదేశాలు జారీ చేయడాన్ని ఖండించారు. ఈ విషయంలో శివపుత్రప్పకు తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.