
మండ్యలో రైతుల రాస్తారోకో
తుమకూరు: బ్యాంకాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా చాంపియన్‌షిప్‌లో తుమకూరు జిల్లా శిరా తాలూకాలోని 9వ తరగతి విద్యార్థి ఉదిత్ బాలాజీ మొదటి స్థానం పొంది బంగారు పతకం సాధించాడు. బ్యాంకాక్ నగరంలోని యూనివర్సల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఇన్ అసోషియేషన్ విత్ ఎస్.జీ.ఎస్ ఇంటర్నేషనల్ యోగా ఫౌండేషన్ బెంగళూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏష్యా పసిపిక్ యోగా చాంపియన్ ిషిప్‌లో సోలో విభాగంలో భారత్ నుంచి పోటీ పడిన ఉదిత్ ఉత్తమ ప్రదర్శన ఇచ్చి బంగారు పతకం సాధించాడు.
కిద్వాయ్‌లో అక్రమాలపై సీఎం దృష్టి
శివాజీనగర: బెంగళూరులోని ప్రముఖ ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి కిద్వాయ్‌లో రోగులకు సక్రమంగా చికిత్స చేయడం లేదని, ఔషధాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కమిటీచే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య ఆదేశించారు. కిద్వాయ్ వైద్యాలయంలో రోగులకు సరిగా వైద్యచికిత్సలు చేయడం లేదని, మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని సీఎంకు ఫిర్యాదులు వచ్చాయి. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీ నియమించి, వివిధ శాఖల అధికారులతో విచారణ జరిపి 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
నీటిని నిలిపేయాలని ధర్నా
మండ్య: తమిళనాడుకు ఇంకెంతమాత్రం ప్రభుత్వం కావేరి నీటిని వదలరాదని కోరుతూ జిల్లా రైతు హితరక్షణ సమితి, రైతుసంఘాలు చేస్తున్న సత్యాగ్రహం 14వ రోజుకు చేరుకుంది. శనివారం ఎమ్మెల్యే హెచ్.టి. మంజు ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కావేరి నీటిని తమిళనాడుకు వదలడం కుదరదన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఉందని, అనేక జలాశయాల్లో నీరు పడిపోయిందని చెప్పారు. నీటిని నిలిపివేసే వరకూ రైతులు, పోరాట సంఘాలు ఆందోళనను కొనసాగిస్తాయని తెలిపారు.
రెండు తిమింగలాల
మృత్యువాత
యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర తాలూకా ముగళి సముద్రతీరంలో శనివారం రెండు బలీన్ జాతికి చెందిన తిమింగలాల కళేబరాలు బయటపడ్డాయి. గత వారం క్రితం 35 మీటర్ల పొడవైన తిమింగలం కళేబరం కొట్టుకురావడం తెలిసిందే. ఈసారి 25 మీటర్ల పొడవున్న మృత తిమింగలం, దానికి దగ్గరలో మరో తిమింగలం కళేబరం ఒడ్డుకు వచ్చాయి. బలీన్ తిమింగళాలు సంతానోత్పత్తి సమయం కావటంతో నేత్రాణి, ముగళి సముద్ర తీరాలకు వస్తుంటాయి. ఈ సమయంలో పెద్ద ఓడలు ఢీకొనడం వల్ల చనిపోయి ఉంటాయని స్థానిక జీవశాస్త్ర విజ్ఞాని ప్రకాశ మేస్త తెలిపారు. తరచుగా తిమింగలాలు మృత్యువాత పడడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
న్యూస్‌రీల్

ఓ తిమింగలం కళేబరం
