శ్రీరంగ పట్టణంలో సుదర్శన యాగం | - | Sakshi
Sakshi News home page

శ్రీరంగ పట్టణంలో సుదర్శన యాగం

Jun 6 2023 4:04 AM | Updated on Jun 6 2023 4:04 AM

మాట్లాడుతున్న భాను ప్రకాశ్‌ శర్మ తదితరులు   - Sakshi

మాట్లాడుతున్న భాను ప్రకాశ్‌ శర్మ తదితరులు

మండ్య: ఓం విశ్వ మహాగురు భగవాన్‌ క్షేత్ర చారిటబుల్‌ ట్రస్టు ఆద్వర్యంలో లోక కళ్యాణం కోసం జూన్‌ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి వారి దేవాలయం ముందు భాగంలో ఉన్న మైదానంలో శ్రీ సుదర్శన మహాయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ప్రముఖ జ్యోతిష్య వేద బ్రహ్మ డాక్టర్‌. భాను ప్రకాశ్‌ శర్మ ఈ మేరకు తెలిపారు. మండ్య నగరంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మహా యాగంలో ఐదు జీవనదుల నుంచి తెచ్చిన నీటితో 108 కలశాలు ఉంటాయని, 11 హోమ కుండలాలను ఏర్పాటు చేసి 130 మంది ప్రసిద్ధ వేద పండితులు ప్రతిరోజు పూజలు హోమాలు నిర్వహిస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement