
కూలిన చెట్లు, రేకులషెడ్డు
తుమకూరు : జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. గాలివానకు పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. మిద్దెలపై రేకులు ఎగిరిపోయాయి. రేకులషెడ్డులు కుప్పకూలాయి. హుళియారు మార్గంలో ఉన్న జాతీయ రహదారి–69లో వరద నీరు నిలిచి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళూరు నుంచి విశాఖ పట్టణం వెళ్లే ఈ రహదారిలో హుళియారులో కొన్ని నెలలుగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ వర్షం నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వర్షం నీరు నిలవడంతో వాహనదారుల ఇబ్బందులు