●మాజీ సీఎం బసవరాజ బొమ్మై
బనశంకరి: ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించినా వాటి అమలులో గందరగోళం నెలకొందని మాజీ సీఎం బసవరాజ బొౖమ్మై వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పథకాల అమలుపై ఆదేశాలు వచ్చినప్పుడే వాటి అమలుపై స్పష్టత వస్తుందన్నారు. ఐదు పథకాల అమలు నేపథ్యంలో గత పథకాలను నిలిపివేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. జలజీవన్‌మిషన్‌కు గతంలో తమ ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. శక్తి యోజన కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారని, కానీ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేశారన్నారు. కేంద్రం ఇప్పటికే ఉచితంగా 5 కిలోలు బియ్యం అందిస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 5 కిలోలు మాత్రమే అందిస్తుందన్నారు. ఉచితంగా ఇచ్చే పది కిలోల్లో రాగులు, జొన్నలు ఉంటాయా? లేక అదనంగా ఇస్తారా? అన్న విషయంలో గందరగోళం నెలకొందన్నారు.