అప్పులు తీర్చేందుకే హత్య

అరెస్టయిన నిందితులు  - Sakshi

బనశంకరి: మహలక్ష్మీపురం వెస్ట్‌ ఆఫ్‌ కార్డ్స్‌ రోడ్డు రెండోస్టేజ్‌ 12వ క్రాస్‌ 4 మెయిన్‌లో గతనెల 27న చోటుచేసుకున్న వృద్ధురాలు కమలమ్మ హత్యోదంతాన్ని మహాలక్ష్మీలేఔట్‌ పోలీసులు ఛేదించారు. అశోక్‌,సిద్దరాజు, అంజనామూర్తి అనే నిందితులను అరెస్ట్‌ చేశారు. ఐపీఎల్‌ బెట్టింగ్‌లో చేసిన అప్పులు తీర్చేందుకు నిందితులు హత్యోదంతానికి పాల్పడి నగలు చోరీ చేశారని పోలీసులు తెలిపారు. వివరాలు.. హతురాలు ఎన్‌.కమల అనే వృద్ధ మహిళ ఒంటరిగా నివసించేది. ఆమె కుమారులు ఇదే నగరంలో వేరోచోట ఉంటున్నారు. ఈమె ఇంటికి మూడునెలల క్రితం ప్లంబింగ్‌ పనులు చేయడానికి నిందితుడు అశోక్‌ వచ్చాడు. ఈమె వద్ద ఎక్కువ బంగారం ఉంటుందని, దోచుకుంటే అప్పులు తీర్చి ప్రశాంతంగా ఉండవచ్చునని ఆలోచించాడు. స్నేహితులైన సిద్దరాజు, అంజనామూర్తితో చర్చించి ఆమె ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. గతనెల 27 తేదీ ఉదయం ఆమె ఇంటికి వెళ్లారు. బిస్కెట్‌ గోదాముకోసం కార్‌షెడ్‌ అద్దెకు ఇస్తారా అని అడిగారు. లేదని చెప్పడంతో వెళ్లిపోయారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు సిద్దరాజు, అంజనామూర్తి వెళ్లి కమల ఇంటిలోకి చొరబడి ఆమెను బంధించి నోటిలో బట్టలు కుక్కి ఉపిరాడకుండా చేసి హత్యచేశారు. ఆమె ఒంటిపై ఉన్న 40 గ్రాముల రెండు బంగారుచైన్లు, చెవిదుద్దులు దోచుకుని ఉడాయించారు. నిందితులు మైసూరులో తలదాచుకొని ఉండగా అరెస్ట్‌ చేశారు. ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కోసం చేసిన అప్పులు తీర్చేందుకు నిందితులు ఈ దారుణానికి పాల్ప్డారని పోలీసులు తెలిపారు.

వీడిన వృద్ధురాలి హత్యకేసు మిస్టరీ

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top