కనుల పండువగా కుంభాభిషేక మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా కుంభాభిషేక మహోత్సవం

Jun 3 2023 12:18 AM | Updated on Jun 3 2023 12:18 AM

బనశంకరీ, శాకంబరీదేవి, చౌడేశ్వరిదేవి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ    - Sakshi

బనశంకరీ, శాకంబరీదేవి, చౌడేశ్వరిదేవి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ

బనశంకరి: భక్తుల మొక్కులు తీర్చే దాక్షాయణిగా పేరుగడించిన బనశంకరీదేవి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జేష్ట శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆలయ ఆవరణలో ప్రధాన అర్చకులు ఆర్‌.సత్యనారాయణశాస్త్రి, చంద్రమోహన్‌ బృందం ఆధ్వర్యంలో లక్ష మోదక శ్రీమహాగణపతి హోమం నిర్వహించి మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు లక్ష కుంకుమార్చన ఆచరించారు. మహామంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. కుంభాభిషేకం నేపథ్యంలో శుక్ర, శనివారం రెండురోజుల పాటు బనశంకరీదేవి మూలవిరాట్‌ దర్శనం నిలిపివేశారు. ఈ సందర్బంగా ఆలయ ఈఓ కే.పద్మ, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు బసవరాజ్‌, సమితి సభ్యులు పాల్గొన్నారు.

అమ్మవారి కలశాలను ఊరేగింపుగా 
తీసుకెళుతున్న దృశ్యం 1
1/1

అమ్మవారి కలశాలను ఊరేగింపుగా తీసుకెళుతున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement