పశ్చిమ బెంగాల్‌వాసులకు బెయిల్‌

జైలు నుంచి విడుదలైన దంపతులు   - Sakshi

బనశంకరి: బంగ్లాదేశ్‌ అక్రమవలసదారులనే అనుమానంతో అరెస్ట్‌ అయి 301 రోజుల పాటు జైలు జీవితం గడిపిన పశ్చిమబెంగాల్‌కు చెందిన పలశ్‌అధికారి, శుక్లా అధికారి అనే దంపతులకు బెయిల్‌ లభించింది. పశ్చిమబెంగాల్‌ పూర్వబుద్వాన్‌ జమాల్పుర నివాసులైన పలశ్‌అధికారి, శుక్లాఅధికారి ఉపాధి కోసం ఏడాదిన్నర పసికందుతో బెంగళూరుకు చేరుకున్నారు. చెత్త విభజన పనులు చేసుకుంటూ మారతహళ్లిలో నివాసం ఉంటున్నారు. 2022 జూలైలో అక్రమ బంగ్లాదేశ్‌ వలసదారులపై చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ దంపతులను కూడా అరెస్ట్‌చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. దీంతో దంపతులు జైలునుంచే న్యాయ పోరాటం చేశారు. పోలీసులు వెళ్లి జమాల్పుర బీడీఓను సంప్రదించి వారు జమల్పురవాసులని తేల్చారు. వీరికి ఏప్రిల్‌ 28 బెయిల్‌ మంజూరైంది. అక్కడివారి సంతకాలు లేక విడుదల ఆలస్యమైంది. చట్టప్రక్రియ పూర్తికావడంతో దంపతులను గురువారం పరప్పనఅగ్రహార జైలు నుంచి విడుదలచేసి పశ్చిమ బెంగాల్‌కు పంపించారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top