
బోల్తాపడిన టిప్పర్
చిక్కబళ్లాపురం: టీవీఎస్ మోపెడ్‌ను తప్పించబోయి ఇసుక టిప్పర్ బోల్తా పడింది. ఈఘటన చిక్కబళ్లాపురం సమీపంలోని హరోబండె వద్ద బుధవారం జరిగింది. గుంతప్పనహళ్లికి చెందిన చలపతి, తిమ్మక్క దంపతులు మోపెడ్‌పై వెళ్తూ రోడ్డును క్రాస్ చేస్తుండగా పేరేసంద్ర వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న టిప్పర్ వచ్చింది. మోపెడ్‌ను గమనించిన డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపు తిప్పాడు. దీంతో టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది. టిప్పర్ తగిలి దంపతులు గాయపడగా పడగా ఆసుపత్రికి తరలించారు.
కన్నడ నటుడు బన్ను రమేశ్ మృతి
బనశంకరి: కన్నడనటుడు బన్నురమేశ్(52) గుండెపోటుతో మృతిచెందారు. బెంగళూరు మహాలక్ష్మీలేఔట్‌లో నివాసం ఉంటున్న బన్నురమేశ్ జిమ్ చేస్తూ సిక్స్‌ప్యాక్ చేశారు. బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. ప్రముఖ నటులు అచ్యుత్‌కుమార్, బుల్లితెరనటుడు ధర్మేంద్రఅరస్‌తో స్నేహంగా ఉండేవారు.